![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -653 లో... అనామిక కుట్రలో భాగంగా రాజ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. రాజ్ ని అప్పు అరెస్ట్ చెయ్యడంతో ఇంట్లో వాళ్ళందరు అప్పుపై కోపంగా ఉంటారు. అప్పు రాగానే ఎందుకు రాజ్ ని అరెస్ట్ చేసావంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మిలు తనపై విరుచుకుపడతారు. బావని అరెస్ట్ చెయ్యడానికి నేను ఏంత ఇబ్బంది పడ్డానో మీకేం తెలుసని అప్పు అంటుంది. అప్పు తన డ్యూటీ తను చేసిందని కళ్యాణ్ అంటాడు.
ఇంట్లో అందరు రాజ్ స్టేషన్లో ఉన్నాడని బాధపడుతుంటారు. అపర్ణకి కావ్య భోజనం తీసుకొని వస్తుంది. నేను తిననంటూ అపర్ణ బాధపడుతుంటే.. నేను తప్పకుండా ఆయన్ని బయటకు తీసుకొని వస్తాను.. అప్పు ఆయన్ని అరెస్ట్ చేసినందుకు ఎంత బాధపడుతుందో నాకు తెలుసని అపర్ణతో కావ్య అంటుంది. అదంతా అప్పు విని తన గదిలోకి వెళ్లి బాధపడుతుంది. కళ్యాణ్ వచ్చి నువ్వేం కావాలని చెయ్యలేదు.. నీ డ్యూటీ నువ్వు చేసావని అంటాడు. నేను పోలీస్ అవ్వకుండా ఉంటే బాగుండు.. ఇలా నా వాళ్ళని నేనే బాధపెడుతున్నానని అప్పు బాధపడుతుంది. మరుసటిరోజు రాజ్ ని కోర్ట్ కి తీసుకొని వస్తారు. రాజ్ తరుపున లాయర్ రాజ్ కి పాజిటివ్ గా మాట్లాడుతుంటే.. అనామిక లాయర్ అతను తప్పు చేసాడంటూ వాదిస్తాడు.
ఇప్పుడు ఒక సాక్షిని ప్రవేశపెట్టాలని అనామిక లాయర్ కావ్యని రప్పిస్తాడు. సామంత్ మా కంపెనీని నాశనం చెయ్యాలని చూసాడు.. కేవలం వార్నింగ్ మాత్రమే రాజ్ ఇచ్చాడు అని కావ్య చెప్తుంది. తరువాయి భాగం లో రాజ్ కి బెయిల్ రద్దు అవుతుంది. ఆ తర్వాత భర్తకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావని కావ్యపై కోప్పడుతుంది అపర్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |